HomeజాతీయంNetarhat Residential School | ఐఏఎస్ ఫ్యాక్టరీ..

Netarhat Residential School | ఐఏఎస్ ఫ్యాక్టరీ..

  • విశేష ఖ్యాతి సంపాదించిన రేతర్ హాట్ స్కూల్..
  • ఝార్ఖండ్ రాష్ట్రం లతేహార్ లో నెలకొన్న పాఠశాల..

ఝార్ఖండ్‌ రాష్ట్రం లతేహార్ జిల్లాలోని నేతర్‌హాట్ రెసిడెన్షియల్ స్కూల్ దేశవ్యాప్తంగా ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’గా విశేష ఖ్యాతి గడించింది. నాణ్యమైన విద్యకు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిలయమైన ఈ పాఠశాల, ఇప్పటివరకు సుమారు 3,000 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ అధికారులను దేశానికి అందించింది. విద్యా ప్రమాణాలకు, విద్యార్థుల క్రమశిక్షణకు ఈ సంస్థ ఒక చిరునామాగా నిలుస్తోంది.

స్వాతంత్ర్యానంతరం ఏర్పాటైన ఈ విద్యాసంస్థ, తన విశిష్టమైన రెసిడెన్షియల్ విద్యావిధానంతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఝార్ఖండ్‌తో పాటు పరిసర రాష్ట్రాల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇక్కడ చేర్పించడాన్ని ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక రాజమార్గంగా భావిస్తారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ పాఠశాల విద్యావిధానాన్ని ప్రశంసించడమే కాకుండా, నైనిటాల్‌లోనూ ఇటువంటి పాఠశాలనే ఏర్పాటు చేయాలని నాడు సూచించారు.

- Advertisement -

ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు నేడు దేశవిదేశాల్లో అత్యున్నత హోదాల్లో కొనసాగుతున్నారు. సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వశిష్ట నారాయణ్ సింగ్, సీబీఐ మాజీ డైరెక్టర్లు డాక్టర్ త్రినాథ్ మిశ్రా, డాక్టర్ రాకేశ్ అస్థానా, కేంద్ర మాజీ హోం కార్యదర్శి జేబీ తుబిడ్, ఐఏఎస్ అధికారి మనీశ్ రంజన్ వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడ చదువుకున్నవారే. కేవలం సివిల్ సర్వీసెస్‌ మాత్రమే కాకుండా, వైద్య, ఇంజినీరింగ్, పరిపాలన వంటి వివిధ రంగాల్లోనూ వీరు విశేష ప్రతిభను చాటుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News