Homeభక్తిTGSRTC | శ్రీశైలం వెళ్లే భ‌క్తుల‌కు టీజీఆర్టీసీ శుభ‌వార్త‌

TGSRTC | శ్రీశైలం వెళ్లే భ‌క్తుల‌కు టీజీఆర్టీసీ శుభ‌వార్త‌

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌యాణికుల‌కు, శ్రీశైలం వెళ్లే భక్తుల‌కు టీజీఆర్టీసీ శుభ‌వార్త అందించింది. దైవ‌ద‌ర్శ‌నార్ధం, విహార‌యాత్ర‌కై మెట్రో డీల‌క్స్ బ‌స్సులో శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ నెల 19న‌ ఆదివారం ఉద‌యం 5గంట‌ల‌కు జేబీఎస్ బ‌స్టాండ్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సు బ‌య‌ల్దేర‌నున్న‌ట్లు రాణిగంజ్ డిపో మేనేజ‌ర్ తెలిపారు.

ఈ ప్ర‌త్యేక బ‌స్సులో శ్రీశైలం శిఖ‌రం, పాల‌ధార పంచ‌ధార‌, సాక్షిగ‌ణ‌ప‌తి, హ‌త్కేశ్వ‌ర దేవాల‌యం, శ్రీశైలం ఆన‌క‌ట్ట‌, శ్రీశైల భ్ర‌మ‌రాంభిక మ‌ల్లికార్జున స్వామి ద‌ర్శ‌నం అనంతరం ఉమామ‌హేశ్వ‌రం టెంపుల్ ద‌ర్శ‌నం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఈ ప్ర‌త్యేక బ‌స్సు ప్యాకేజీ కింద బ‌స్ చార్జీలు పెద్ద‌ల‌కు రూ. 1500, పిల్ల‌ల‌కు రూ. 1200 చెల్లించి ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని పేర్కొన్నారు. ఇందుకుగాను 9959226147, 8096181859, 9394061089 సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News