Homeబిజినెస్Semaglutide | చతికిల పడ్డ సెమాగ్లుటైడ్ మెడిసిన్..

Semaglutide | చతికిల పడ్డ సెమాగ్లుటైడ్ మెడిసిన్..

  • గణనీయంగా తగ్గిన అమ్మకాలు..

దేశంలో డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని భావించిన సెమాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్ అనూహ్యంగా చతికిలపడింది. మార్కెట్లోకి వచ్చిన తొలి నెలలో భారీ అమ్మకాలతో సంచలనం సృష్టించిన ఈ మందు, ఇప్పుడు కొన్ని నెలల్లోనే వృద్ధి వేగాన్ని కోల్పోయి డీలా పడింది. అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో పాటు, కంపెనీల వద్ద భారీగా సరుకు నిల్వలు పేరుకుపోయాయి.

నోవో నార్డిస్క్ కంపెనీకి చెందిన ఒజెంపిక్, వెగోవి మందులలో వాడే సెమాగ్లుటైడ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్‌పై పేటెంట్ గడువు ముగియడంతో, ఈ ఏడాది మార్చి చివరిలో భారత మార్కెట్లోకి జనరిక్ వెర్షన్లు ప్రవేశించాయి. తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో ఏప్రిల్‌లో ఈ జనరిక్ మందుల అమ్మకాలు నెలవారీగా ఏకంగా 50 శాతం పెరిగాయి. బ్రాండెడ్ మందులతో పోలిస్తే వీటి ధర నెలకు రూ.1,000 నుంచి రూ.2,500కే లభించడంతో చాలామంది వీటిని కొనుగోలు చేశారు.

- Advertisement -

అయితే ఈ జోరు ఎక్కువ కాలం నిలవలేదు. ‘ఫార్మార‍్యాక్’ గణాంకాల ప్రకారం, మే నెలలో సెమాగ్లుటైడ్ అమ్మకాల విలువ వృద్ధి కేవలం 6 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో 88 శాతంగా ఉన్న యూనిట్ల వృద్ధి, మే నాటికి 12 శాతానికి కుప్పకూలింది. జూన్ నాటికి, మొత్తం జీఎల్‌పీ-1 అగోనిస్ట్ మార్కెట్ విలువ రూ.236 కోట్ల నుంచి రూ.227 కోట్లకు పడిపోయి, మొదటిసారి నెలవారీ క్షీణతను నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News