Saturday, July 4, 2026
Homeస్పోర్ట్స్FIFA | క్వాటర్ ఫైనల్ లో అర్జెంటీనా..

FIFA | క్వాటర్ ఫైనల్ లో అర్జెంటీనా..

  • రౌండ్ 32 మ్యాచ్ లో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో గెలుపు..

ఈ యేటి ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆఫ్రికా దేశం కేప్ వెర్డే .. గ్రూపు ద‌శ‌లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక ఇవాళ రౌండ్‌32 మ్యాచ్‌లోనూ డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాకు చుక్క‌లు చూపించింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఈ మ్యాచ్ గెలిచేందుకు తీవ్రంగా క‌ష్ట‌ప‌డింది. కేప్ వెర్డే ఈ మ్యాచ్‌లో విరోచిత పోరాటం చేసింది. ఎక్స్‌ట్రా టైంలో ఆ దేశ ప్లేయ‌ర్ సిడ్నీ లోప్స్ కాబ్ర‌ల్ స్ట‌న్నింగ్ గోల్ కొట్టి .. అర్జెంటీనా ప్లేయ‌ర్ల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చాడు.

తొలుత నిర్ణీత 90 నిమిషాల వ‌ర‌కు రెండు జ‌ట్లు 1-1 గోల్స్ తో స‌మంగా నిలిచాయి. అయితే ఎక్స్‌ట్రా టైంలో ముందు అర్జెంటీనా ఓ గోల్ చేసి 2-1 ఆధిక్యాన్ని సాధించింది. కానీ అర్జెంటీనా ఆశ‌ల‌పై కాబ్ర‌ల్ నీళ్లు చ‌ల్లాడు. క‌ళ్లు చెదిరే రీతిలో అత‌ను కార్న‌ర్ గోల్ కొట్టాడు. దీన్ని గోల్ ఆఫ్ టోర్న‌మెంట్‌గా నిపుణులు భావిస్తున్నారు. బాక్సు ఎడ్జ్ నుంచి కొట్టిన ఆ షాట్‌కు బంతి క‌ర్వ్ తీసుకుని టాప్ కార్న‌ర్ దిశ‌గా గోల్ పోస్టులోకి వెళ్లింది. ఊహించ‌ని రీతిలో కాబ్ర‌ల్ గోల్ చేయ‌డంతో మెస్సీ బృందం ఖంగుతిన్న‌ది.

- Advertisement -

టాప్ కార్న‌ర్ గోల్‌తో ఒక్క‌సారిగా అర్జెంటీనాకు కాబ్ర‌ల్ షాకిచ్చాడు. అయితే ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అత్యుత్త‌మ గోల్ అన్న అభిప్రాయాలు ప్ర‌స్తుతం వ్య‌క్తం అవుతున్నాయి. ప‌సికూన‌గా ఎంట్రీ ఇచ్చిన కేప్ వెర్డే.. ఎవ‌రూ అంచ‌నా వేయ‌ని రీతిలో ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టింది. కానీ రౌండ్‌32 మ్యాచ్‌లో చివ‌రి నిమిషంలో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో నెగ్గి క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News