Monday, June 22, 2026
HomeసినిమాOh..! Sukumari | మూవీ లవ్ మెలోడీ టైటిల్ సాంగ్ రిలీజ్

Oh..! Sukumari | మూవీ లవ్ మెలోడీ టైటిల్ సాంగ్ రిలీజ్

యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా ‘ఓ..! సుకుమారి’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘శివం భజే’ చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఓ..! సుకుమారి’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘ఓ..! సుకుమారి’ టైటిల్ సాంగ్ ఒక స్వచ్ఛమైన ప్రేమగీతంగా ఆకట్టుకుంటుంది.

- Advertisement -

భరత్ మంచిరాజు స్వరపరిచిన ఈ మెలోడీ హృదయాన్ని హత్తుకునే ట్యూన్‌తో ప్రేమలోని మాధుర్యాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. అభిజిత్ రావు సోల్ ఫుల్ వోకల్స్ తో పాటకు మరింత ప్రాణం పోయగా, పూర్ణాచారి అందించిన సాహిత్యం ప్రేమలో పడిన యువకుడి భావాలను ఎంతో అందంగా ప్రజెంట్ చేసింది.

ఈ పాటలో తిరువీర్ తన ప్రేమను అమాయకంగా, నిజాయితీగా వ్యక్తం చేస్తుండగా, ఐశ్వర్య రాజేష్ ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, తన భావాలను అందంగా పలికించే తీరు ఆకట్టుకుంటుంది.

ఆహ్లాదకరమైన సంగీతం, మనసుహత్తుకునే పదాలు, మనసును తాకే గానం కలిసి ‘ఓ..! సుకుమారి’ టైటిల్ సాంగ్‌ను వినగానే మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీగా నిలిచింది.

‘ఓ..! సుకుమారి’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

తారాగణం: తిరు వీర్, ఐశ్వర్య రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్ (మ్యాడ్ ఫేమ్), ఝాన్సీ, ఆమని, ఆనందకోట జయరామ్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకుడు: భరత్ దర్శన్
డీవోపీ: CH కుషేందర్
సంగీత దర్శకుడు: భరత్ మంచిరాజు
ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి
లిరిక్స్: పూర్ణాచారి
ఫైట్స్: అంజి
కొరియోగ్రఫీ: జెడి మాస్టర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -
RELATED ARTICLES

Latest News