Monday, June 15, 2026
Homeస్పోర్ట్స్Vaibhav | నిరాశపరిచిన వైభవ్..

Vaibhav | నిరాశపరిచిన వైభవ్..

  • భారత జెర్సీతో విఫలం..
  • సులువుగా వికెట్ చేరజార్చుకున్న యువ హిట్టర్..

ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో చిత‌క్కొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీ భార‌త జెర్సీతో మాత్రం విఫ‌లమ‌య్యాడు. ముక్కోణ‌పు సిరీస్‌లో శ్రీ‌లంక ఏ బౌల‌ర్లను ఉతికేస్తాడ‌నుకుంటే సులువుగా వికెట్ ఇచ్చేశాడీ హిట్ట‌ర్. మ‌రో ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్‌ సైతం డ‌గౌట్ చేర‌డంతో ప‌వ‌ర్ ప్లేలోనే టీమిండియా ఏ రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది.

ముక్కోణ‌పు సిరీస్ మూడో మ్యాచ్‌లో భార‌త ఏ జ‌ట్టుకు శుభారంభం ద‌క్క‌లేదు. శ్రీ‌లంక ఏ బౌల‌ర్లను ఉతికేసి భారీ స్కోరందిస్తారనుకుంటే ఓపెన‌ర్లు తేలిపోయారు. ఐపీఎల్‌లో రికార్డు శ‌త‌కంతో రెచ్చిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ(21), మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్‌(11)లు విఫ‌ల‌మ‌య్యారు. త‌న మార్క్ విధ్వంసంతో చెల‌రేగాల‌నుకున్న వైభవ్‌ను స‌మ‌న్ అరాచిగే ఔట్ చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News