Thursday, June 4, 2026
Homeఆరోగ్యంDepression | డిప్రెషన్ అనేది పెను ప్రమాదం..

Depression | డిప్రెషన్ అనేది పెను ప్రమాదం..

  • మెదడు పని తీరుపై గణనీయమైన ప్రభావం..
  • హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు..

డిప్రెషన్ అనేది కేవలం మానసిక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది మెదడు పనితీరుపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా డిప్రెషన్ ఎంతకాలం కొనసాగుతుందనే అంశం మెదడులో సంభవించే మార్పుల తీవ్రతను ప్రభావితం చేస్తుంద‌ని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం ఫలితాలు భవిష్యత్తులో వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చికిత్సా విధానాల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ పరిశోధనలో మేజర్ డిప్రెషన్‌తో బాధపడుతున్న 46 మంది రోగుల మెదడు స్కాన్‌లను విశ్లేషించారు. పరిశోధన ఫలితాలు డిప్రెషన్ ఎపిసోడ్‌ల వ్యవధి, మెదడులోని వివిధ నాడీ నెట్‌వర్క్‌ల మధ్య అనుసంధానంలో ఉన్న మార్పుల మధ్య సంబంధం ఉందని సూచించాయి. ముఖ్యంగా రెండేళ్లకు పైగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో, ఇటీవల డిప్రెషన్ ప్రారంభమైన వారితో పోలిస్తే భిన్నమైన మెదడు కనెక్టివిటీ నమూనాలు కనిపించాయి.

- Advertisement -

మెదడులోని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్క్ నిర్ణయాలు తీసుకోవడం, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం వంటి పనులకు బాధ్యత వహిస్తుంది. మరోవైపు డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ అనేది ఆత్మపరిశీలన, వ్యక్తిగత ఆలోచనలు, జ్ఞాపకాలతో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ రెండు నెట్‌వర్క్‌లు సమతుల్యంగా పనిచేస్తాయి. అయితే డిప్రెషన్ ఉన్నవారిలో ఈ సమన్వయం దెబ్బతినే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది.

ఈ అసమతుల్యత కారణంగా వ్యక్తులు ప్రతికూల ఆలోచనల్లో చిక్కుకుపోవడం, పదేపదే అదే విషయాలను ఆలోచించడం, అవసరమైన సమయంలో పరిసరాలపై దృష్టి సారించడంలో ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయ‌ని పరిశోధకులు తెలిపారు. డిప్రెషన్ తీవ్రత పెరిగే కొద్దీ ఈ ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయ‌ని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News