Monday, June 1, 2026
HomeతెలంగాణHusnabad | "హుస్నాబాద్" మీడియా సమావేశంలో.. "మంత్రి పొన్నం"

Husnabad | “హుస్నాబాద్” మీడియా సమావేశంలో.. “మంత్రి పొన్నం”

  • మంత్రి పొన్నం ప్రభాకర్
  • పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే, నవ నిర్మాణ సభ పెట్టుకోవాలి..

తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ బీజేపీ ఎజెండా మోస్తున్నారు. తెలంగాణ మీద విషం కక్కి, తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పిన మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.. తెలంగాణ ఏర్పడితే, 11 రోజులు అన్నం మానేసినా ననీ బహిరంగంగా చెప్పిన వ్యక్తి, తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే మాకు అభ్యంతరం ఏమి లేదు. కానీ ఇక్కడ నవ నిర్మాణ సభ పెడితే తీవ్ర ఆక్షేపిస్తున్నాం.

కన్న తల్లికి గాజులు కొనలేని వాడు, పినతల్లికి ఒడ్డాణం చేస్తారని సమేత ఉంది. కుట్ల రాయి తీయలేని వాడు.. ఎట్లా రాయి తీస్తాడా.. జూన్ 02 నా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, దీనిని ప్రతి తెలంగాణ బిడ్డ వేడుకల పండగల జరుపుకుంటాం.. ఈ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే, ఎవరైనా పాల్గొనచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి విడిపోయిన రాష్ట్రంగా మాకు ప్రేమ ఉంది. భారతీయులుగా ఇతర రాష్ట్రాలను గౌరవించాలి, అవమానపరుచుకోవద్దు.

- Advertisement -

వాస్తవంగా.. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు..

ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రిగా చేయలేనిది, ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఎవరు వినడానికి సిద్దంగా లేరు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి.. ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేయాలని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ నటన మొదలు పెట్టారు. 2014 లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పోచేస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు.. తొడకలు తీస్తాం అని చెప్పం..

తెలంగాణ కళ్ళ దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయనీ చెప్పిన మీరు, బీజేపీ రెన్యుమనేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని, కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పు పవన్.. మాకు అస్సాం కంటే, ఆంధ్రప్రదేశ్ దగ్గర.. ఆంధ్రప్రదేశ్ తో సంత్సంబంధాలు ఉండాలని కోరుకుంటాం. తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యుడిగా.. సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ కోసం పోరాటం చేసినం.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, పోరాట యోధులను గుర్తించాలని ప్రభుత్వం కమిటీ వేసి ముందుకు పోతుంది. వారిని గుర్తించి గౌరవించాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారు. నవ నిర్మాణ సభ గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు లో ఎందుకు పెట్టడం లేదు. దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతుంటే, అలాగే జనగణనలో కులగన చేపట్టకపోతే నోరు మెదపని మీరు. బీజేపీ డైరెక్షన్ లో తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు రెచ్చగొట్టేలా చేస్తే, తెలంగాణ ప్రజలు ఊరు కోరు.

పైసలు ఇస్తే ఏ నటన చేయమంటే ఆది చేస్తాడు.

మీరు సినిమా నటులు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ, తెలంగాణపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన వ్యక్తి వహిస్తే సహించం.. ఇది ప్రజాస్వామ్య దేశం, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు..

మీకు ఏపీ ప్రజలు ఆశీర్వదించి, అధికారం ఇచ్చారు. అక్కడ చూయించండి మీ నవ నిర్మాణం. కూట్లే రాయి తీయకుండా ఎట్ల రాయి ఇస్తానని బయలు తేరడం ఎందుకు..? మీ బాస్ మోదీ ను మెప్పించడానికి తెలంగాణలో సభ పెడుతున్నారా..? తెలంగాణలో సభ ఏర్పాటు చేయాలి, నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి. ఇక్కడ జనాలు తన్నుకు చావాలి.. ఇదేనా మీ పవనిజం ?

అనువనవున తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్ మొదట తెలంగాణ వాదులకు క్షమాపణ చెప్పాలి. తక్షణమే తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణలు చెప్పాలి, తెలంగాణ ద్వేషి పవన్.. ఇక్కడ విద్వేష రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదు. ఇక్కడ బిజెపి పప్పులు ఉడకక.. ఏజెంట్ గా పవన్ నీ ఇక్కడికి పంపిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదు.

హీరోగా పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తాం, ఆదరిస్తాం.. కానీ రాజకీయ నాయకుడిగా తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర ఉన్న పవన్ కళ్యాణ్ ను నిలదీస్తాం. పవన్ సార్ధక నామదేయుడు, ఆయన వ్యవహార శైలి గాలివాట చందం, చేగువేరా టీ షర్టుతో ప్రారంభమైన ప్రస్థానం.. ఇప్పుడు మోడీ నీకు కౌగిలించుకొని ప్రజల చేత చీకట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు.

తెలంగాణలో మీరు ఉద్ధరించేది ఏంటి..? ఏపీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఆదుకో.. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే గుడ్లు అప్పగించూకొని మీరు చూస్తున్నారు. కృష్ణపట్నం గంగవరం పోర్టులు ప్రధానికి కట్టబెట్టిన మోడీని ప్రశ్నించని చేతగానితనం మీది. సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు నిజజీవితంలో దేశభక్తి చూయించు పవన్ కళ్యాణ్. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారు. మీ ఫ్యాన్స్ చాలా మంది నిరుద్యోగులే ఉన్నారు. చేతనైతే వారికి ఉద్యోగాలు ఇప్పించు.. కేవలం జై జైలు కొట్టించుకొని పస్తులు ఉంచడం తగదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News