- షోషల్ మీడియాలో ఫార్టు వాక్స్ పేరుతో వైరల్..
- జీర్ణక్రియకు సూచిస్తున్న సరళమైన అలవాటు..
భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు నడవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫార్ట్ వాక్స్ పేరుతో వైరల్ అవుతోంది. అయితే ఇది కొత్త అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత స్వల్పంగా నడవడం జీర్ణక్రియకు చాలా కాలంగా సూచిస్తున్న సరళమైన అలవాట్లలో ఒకటని వివరిస్తున్నారు. ఈ చిన్న నడక కేవలం ఆహారం జీర్ణం కావడానికే కాదు, కడుపులో గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం తగ్గించడంలో, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
జీర్ణాశయ ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన తర్వాత 5 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ఇంటి చుట్టూ, ఆఫీస్‌లో, ట్రెడ్‌మిల్‌పై లేదా బయట వీధిలో నెమ్మదిగా నడిచినా సరిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కఠినమైన వ్యాయామం చేయకుండా సాదాసీదా నడక మాత్రమే చేయాలని సూచిస్తున్నారు.
