Thursday, May 28, 2026
Homeఆరోగ్యంHeatwave | హీట్ వేవ్ హెచ్చరికలు..

Heatwave | హీట్ వేవ్ హెచ్చరికలు..

  • మండే ఎండలతో జాగ్రత్తగా ఉండాలి..
  • ప్రమాదంలో ప్రజల ఆరోగ్యాలు..
  • 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ నమోదు..

ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేయగా, ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన వేడి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బయట పనులు చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆసుపత్రుల్లో కూడా వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఆసుపత్రుల ఔట్‌పేషెంట్ విభాగాలు, అత్యవసర విభాగాలకు డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ ప్రారంభ లక్షణాలతో బాధపడుతున్న రోగులు అధికంగా వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎండ తీవ్రత కొనసాగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News