Thursday, May 21, 2026
Homeఆదిలాబాద్Singareni | నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోల్ బెల్ట్

Singareni | నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోల్ బెల్ట్

శ్రీరాంపూర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండల్లో పని చేయడం వల్ల కార్మికుల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని శ్రీరాంపూర్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమరయ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కార్మికుల పనివేళల్లో వెంటనే మార్పులు చేయాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఉదయం చల్లని సమయాల్లో పనులు నిర్వహించి, మధ్యాహ్నం తీవ్ర ఎండ సమయంలో పనులను తగ్గించేలా చేసి కార్మికులకు విశ్రాంతి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా గనుల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి మజ్జిగ ప్యాకెట్లు, ORS ప్యాకెట్లు, తాగునీరు సమృద్ధిగా అందించాలని డిమాండ్ చేశారు. వేడి తీవ్రత కారణంగా కార్మికులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య పరిరక్షణ చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు.

- Advertisement -

ఓపెన్ కాస్ట్ గనుల్లో సరైన విశ్రాంతి షెడ్లు, చల్లని తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కూడా ఆయన కోరారు. కార్మికుల ప్రాణ భద్రతకు యాజమాన్యం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.కార్మికుల సమస్యలను వెంటనే గుర్తించి, పనివేళల మార్పుపై సింగరేణి యాజమాన్యం తక్షణ నిర్ణయం తీసుకోవాలని మోత్కూరి కొమరయ్య డిమాండ్ చేసి ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్మికుల ఆరోగ్యం కాపాడటం సంస్థ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News