Wednesday, May 20, 2026
Homeస్పోర్ట్స్Anil Kumble | వైభవ్ సూర్యవంశీపై కుంబ్లే ప్రశంసలు..

Anil Kumble | వైభవ్ సూర్యవంశీపై కుంబ్లే ప్రశంసలు..

  • క్రిస్ గేల్ రికార్డు బద్దలుకొడతాడు..
  • వైభవ్ బ్యాటింగ్ స్టైల్ సూపర్..

టీనేజ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీపై.. మాజీ క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే ప్ర‌శంస‌లు కురిపించారు. విండీస్ బ్యాట‌ర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసే స‌త్తా వైభ‌వ్‌కు ఉన్న‌ట్లు చెప్పారు. సూర్య‌వంశీ త‌న బ్యాటింగ్ శైలితో ఆక‌ట్టుకుంటున్న‌ట్లు తెలిపారు. ఐపీఎల్‌లో ఓ సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉన్న‌ది. అయితే ఆ రికార్డును సూర్య‌వంశీ అధిగ‌మిస్తాడ‌ని కుంబ్లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. మంగ‌ళ‌వారం ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ ఆరు సిక్స‌ర్లు కొట్టాడు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో సూర్య‌వంశీ 53 సిక్స‌ర్లు బాదాడు. అయితే గ‌తంలో క్రిస్ గేల్ ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధికంగా 59 సిక్స‌ర్లు బాదాడు. ఇక ఆ సిక్స‌ర్ల రికార్డును బ్రేక్ చేసే అవకాశం సూర్య‌వంశీకి ఉన్న‌ట్లు కుంబ్లే పేర్కొన్నారు. ఆర్ఆర్ జ‌ట్టుకు లీగ్ ద‌శ‌లో మ‌రో మ్యాచ్ ఆడనున్న‌ది, ఒక‌వేళ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తే, అప్పుడు గేల్ రికార్డును క‌చ్చితంగా సూర్య‌వంశీ బ్రేక్ చేస్తాడ‌ని కుంబ్లే అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News