Wednesday, May 20, 2026
Homeతెలంగాణకేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో సామాన్యుడు కుదేలు..

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో సామాన్యుడు కుదేలు..

  • తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో సామాన్య మానవుడు కుదేలు అవుతున్నాడని బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు పెంపు సమర్ధించాల్సిన అంశం కాదని అన్నారు. ధరల పెంపు నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేకత చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగి సగటు జీవి బతుకులో పిడుగుపాటుగా మారిందని ఆయన అన్నారు.

ఆత్మ నిర్భర పథకం కేవలం ఓట్లు రాజకీయ పథకం మాత్రమే తప్ప సామాన్యుడికి మేలు చేసే పథకం కాదని ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని పదేపదే చెప్పి ఎన్నికలు అయిపోగానే ఓటర్లు బోడ మల్లయ్యలు ఓట్లకు ముందు ఓడ మల్లయ్యలు అయ్యారని ఎద్దేవా చేశారు. చమురు ధరల పెంపుతో చిన్నాచితక మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకుంటున్నాయని, యువతకు ఉపాధి గ్యారెంటీ లేకుండా పోయిందని, రైతులను రాజులను చేస్తాం వారి ఆదాయం రెట్టింపు చేస్తాం అన్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని అన్నారు.

- Advertisement -

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపించి రేట్లు పెంచడం పేదల నడ్డి విరవడం కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్ ధరల భారం ఎప్పుడూ పెట్రోల్ బంకుల దగ్గరే ఆగిపోదని ప్రతి వంటగది, ప్రతి పంట పొలం ప్రతి కుటుంబం బడ్జెట్లోనూ చొరబడుతుందని ఇప్పటికే మధ్య తరగతి పేద ప్రజలు వంట గ్యాస్ కే అధికంగా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ద్రవ్యోల్బణం నిరుద్యోగం తక్కువ వేతనాలు అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధర పెంపుదల అదనపు భారాన్ని పెంచిందని పెట్రోలియం ఉత్పత్తులపై భారీ పన్ను భారం మాత్రం ప్రజలు సంవత్సరాలుగా భరించవలసి వస్తుందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కేంద్రం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అడ్డు అదుపు లేకుండా చమురు ధరలు పెంచడం సామాన్య ప్రజల జీవితాలు తీవ్ర ఇబ్బంది పడ్డాయని పెంచిన ఇంధనం వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

నీట్ రద్దు నిరంకుశ నిర్ణయం :

నీట్ యు జి 2026 రద్దు నిర్ణయం నోట్ల రద్దు లాంటిదని కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీకులు దేశ యువతను అనిచిత నిరాశలోకి నెట్టిందని ఏళ్ల కొద్ది విద్యార్థులు చదివిన చదువులు కన్న కలలు కల్లలు అయ్యాయని అన్నారు కేంద్ర ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో 93 పేపర్లు లీక్ అయ్యాయని నూతి శ్రీకాంత్ గౌడ్ ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News