Friday, May 15, 2026
Homeహైదరాబాద్‌Hyderabad | ఈనెల 24న ఎక్స్ పీరియమ్ లో టాడి మ్యూజిక్ ఫెస్టివల్

Hyderabad | ఈనెల 24న ఎక్స్ పీరియమ్ లో టాడి మ్యూజిక్ ఫెస్టివల్

సహజ సిద్ధమైన కల్లు, నీరా విశిష్టతను నగరవాసులకు తెలియజేసేందుకు ఈ నెల 24న చిలుకూరు బాలాజీ రూట్ లో రాందేవ్ 150 ఎకరాల్లో 500 తాడి చెట్లు 10కోట్ల రూపాయలతో తాటికల్లు మేళా ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేసి టాడి మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న, ఎక్స్పీరియమ్ అధినేత రామ్ దేవ్ రావు ముందడుగు తో కలిసి మాట్లాడారు.

రాజకీయాలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొనడానికి రాందేవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చామని అన్నారు. కల్లు ఆరోగ్యానికి మంచిది మేజర్ హోటల్ లలో కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు ఆరోజు జరిగే కార్యక్రమం పై ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ డ్రింక్ గా తాటి కల్లు చేయాలని వారు కోరారు.

- Advertisement -

ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన కళ్ళు, నీరాపై అపోహలు తొలగించి వైన్స్ బార్ షాపులో విక్రయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. గీతావృత్తి బతకాలని, ఆరోగ్యంగా ఉంటూ నేచర్ కాపాడాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News