Homeహైదరాబాద్‌Arey Apandra | 'అరేయ్ ఆపండ్రా' చిత్రాన్ని ఆదరించండి

Arey Apandra | ‘అరేయ్ ఆపండ్రా’ చిత్రాన్ని ఆదరించండి

వినోదంతో పాటు సందేశాత్మకంగా ‘అరేయ్ ఆపండ్రా’ చిత్రాన్ని నిర్మించినట్లు ఆ చిత్ర దర్శకుడు, నటుడు తల్లాడ సాయి కృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నటులు కిశోర్ దాస్, భద్రంతో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. అతి తక్కువ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించామని, ఈమధ్య జర్నీ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా మెసేజ్ ఉన్నా పూర్తిగా హాస్య భరితమైన సినిమా తో వస్తున్నాము.

Arey Apandra Movie Release and Press Meet2

సాంకేతికపరంగా ఎంతో విలువలు పాటించామని, ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా వీక్షించే విధంగా చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా 50 థీయేటర్లలో సినిమాను విడదుల చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అశోక్ నిమ్మల, నటుడు వినోద్, ఎడిటర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News