Thursday, May 14, 2026
Homeఆదిలాబాద్Mancherial | అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల మేయర్

Mancherial | అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల మేయర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. 50 లక్షల వ్యయం తొ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని మరియు 4 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన డ్రైనేజీ నిర్మాణం పనులను ఈ రోజు మేయర్ స్థానికులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని డివిజన్లలో మంచిర్యాల శాసనసభ్యుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్క డివిజన్ అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో 32 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతీ తిరుపతి ,యూత్ అధ్యక్షులు పిట్టల రవి ,32 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News