- గట్టుపల్లి అంజన్నకు పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే.
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజన్న, అంజనీ పుత్రుడు గట్టుపల్లి అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టిఆర్ఎస్వి నాయకులు తుప్పుడు నర్సింహా శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అంజన్నకు తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్షదాన శిబిరంలో రక్తదానం చేశారు.
అంజన్నకు కపటం లేదని, ప్రత్యర్ధులను సైతం ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం కలవాడని అన్నారు. అంజన్నకు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని కొండగట్టు అంజన్నకు వేడుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు బుడ్డగోళ్ల ఈశ్వర్,చించెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
