- ఈనెల 11 నుంచి ప్రక్రియ ప్రారంభం..
- 6, 7, 8,9 త్తరగతుల్లో సీట్ల భర్తీ..
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు ఒక ప్రకటనలో వెల్లడించారు. బీసీ గురుకులంలో మొత్తం 10,138 బ్యాక్లాగ్ సీట్లు అందుబాటులో ఉండగా, వాటీ భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. మెరిట్ విద్యార్థుల జాబితాను https: //mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో పెట్టారు. ఎంపికైన విద్యార్థులు నిర్దేశిత గురుకులంలో 11 నుంచి అడ్మిషన్లు పొందాలని సొసైటీ సెక్రటరీ సూచించారు.
- Advertisement -
