Wednesday, May 6, 2026
HomeజాతీయంTVK | రేపు లేదా ఎల్లుండి విజయ్ ప్రమాణ స్వీకారం..

TVK | రేపు లేదా ఎల్లుండి విజయ్ ప్రమాణ స్వీకారం..

  • విజయ్ కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ..
  • ప్రస్తుత బలం 106 మాత్రమే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్‌ విజయ్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మే 7 లేదా 8న సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యా బలం ఇంకా సమకూరలేదు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాగా, తిరుచిరాపల్లి తూర్పు, పెరంబూర్ స్థానాల్లో గెలిచిన విజయ్‌ ఒక దానిని వదులుకోవాల్సి ఉంటుంది. తిరుచి ఈస్ట్‌కు ఆయన రాజీనామా చేస్తే ఈ సంఖ్య 107కు తగ్గుతుంది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌ను కూడా టీవీకే ఎన్నుకుంటుంది. దీంతో విశ్వాస తీర్మానం సమయంలో స్పీకర్‌ ఓటు వేయలేరు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో టీవీకే వాస్తవ సంఖ్యా బలం 106కు తగ్గిపోతుంది.

- Advertisement -

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్క్‌ లేకపోవడంతో కూటమి ఏర్పాటు కోసం టీవీకే ప్రయత్నిస్తున్నది. బుధవారం ఆ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు కలిపితే సంఖ్యా బలం 111కు చేరుతుంది. దీంతో 118 మెజారిటీ మార్క్‌ కోసం ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు కావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో మరికొన్ని పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News