Friday, April 24, 2026
Homeబిజినెస్Union Bank | మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలం..

Union Bank | మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలం..

  • నష్టాల్లో ట్రేడ్ అవుతున్న యూనియన్ బ్యాంకు షేర్లు..

2026 ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికానికి సంబంధించి యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా క్యూ4 రిజల్ట్స్ మార్కెట్ అంచనాలని అందుకోవడంలో విఫలం అవ్వడంతో ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం 3 శాతం పెరిగి రూ. 5,316 కోట్లకి చేరుకుంది. మరొకవైపు బ్యాంకు నెట్ ఇంటరెస్ట్ ఇన్కమ్ 1 శాతం తగ్గింది.

లార్జ్ క్యాప్ కేటగిరికి చెందిన బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్ అయిన యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లిమిటెడ్ షేర్లు ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2026 ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికానికి సంబంధించి యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా క్యూ 4 రిజల్ట్స్ మార్కెట్ అంచనాలని అందుకోవడంలో విఫలం అవ్వడంతో ఈరోజు ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరొకవైపు గత ఏడాది కాలంలో ఈ బ్యాంకు 37 శాతం లాభాన్ని తమ షేర్ హోల్డర్స్ కి అందించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News