- 14 రోజులపాటు గ్రుడ్డు తింటే చాలా మార్పులొస్తాయి..
- మెదడుపని తీరు ఎంతగానో మెరుగుపడుతుంది..
గుడ్లు రోజువారీ ఆహారంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే పదార్థాల్లో ఒకటి. వీటిని తేలికగా వండుకోవచ్చు, ఎన్నో వంటకాలతో కలిపి తినవచ్చు, ముఖ్యంగా ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లపై ఆధారపడుతుంటారు. కొందరికి ఇవి ప్రతి రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి కాగా, మరికొందరికి కొలెస్ట్రాల్ గురించి సందేహాలు ఉంటాయి. అయితే గుడ్లు కేవలం సులభమైన ఆహారమే కాదు, ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి. మెదడు పనితీరు, శక్తి స్థాయిలు, చర్మం, జుట్టు, కంటి ఆరోగ్యం వంటి అంశాల్లో కూడా గుడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ఇక 14 రోజుల పాటు గుడ్లను ప్రతిరోజూ తింటే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మొదటగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గుడ్లలో కోలిన్ అనే పోషకం అధికంగా ఉంటుంది. ఇది మెదడులో అసెటైల్కోలిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ తయారీలో సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహకరిస్తుంది. నాలుగవది, జుట్టు, చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉండటానికి గుడ్లు సహాయపడతాయి. గుడ్లలో సల్ఫర్ కలిగిన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కెరాటిన్ అనే ప్రోటీన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో జుట్టు బలంగా, చర్మం ఆరోగ్యంగా, గోర్లు దృఢంగా మారుతాయి. ఇలా 14 రోజుల పాటు గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మంచి మార్పులు జరుగుతాయి.
