- 84 పోస్టులను భర్తీ చేయనున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్..
దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026’ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 84 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్.. ఎస్సెస్సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు హిందీ/ ఇంగ్లిష్ స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు హిందీ/ ఇంగ్లిష్‌లో ట్రాన్స్లేషన్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
