Thursday, April 23, 2026
Homeరంగారెడ్డిMarri Rajasekhar Reddy | కాలయాపన తప్ప ప్రజలకు చేసింది శూన్యం

Marri Rajasekhar Reddy | కాలయాపన తప్ప ప్రజలకు చేసింది శూన్యం

  • ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా కాలయాపన చేయడమే తప్ప ప్రజలకు అవసరమైన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించలేదని తీవ్రంగా ఆరోపించారు.

తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించినట్లు తెలిపారు. ఏ పనినైనా చిత్తశుద్ధితో చేసి, సరైన ఫాలోఅప్ ఉంటేనే విజయవంతంగా పూర్తి చేయగలమని పేర్కొన్నారు.అదేవిధంగా కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ వల్ల ఎండాకాలంలో కూడా రైతులు రెండు పంటలు పండించగలుగుతున్నారని తెలిపారు. తెలంగాణ జల వనరులపై పూర్తి అవగాహన కేసీఆర్‌కు ఉందని గుర్తు చేశారు.

- Advertisement -

పి.సి. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కమిషన్ విధివిధానాలు పాటించలేదని, సాక్షులను పిలిచి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని ధర్మాసనం ఆక్షేపించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికకు చెల్లుబాటు లేదని స్పష్టం చేస్తూ, నిజం చివరకు బయటపడిందని పేర్కొన్నారు.

కేసీఆర్, హరీష్ రావుల పై వచ్చిన ఆరోపణలు నిలబడలేదని, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తేలిపోవడంతో ప్రజల్లో వాస్తవం బయటపడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా నిలిచిందని, రాజకీయ ఆరోపణలను తట్టుకుని నిజం విజయం సాధించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల నమ్మకం మరింత బలపడిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, మేకల రాము యాదవ్, తోట నరేందర్ రెడ్డి, అరుణ్ రావు, ఢిల్లీ పరమేష్ , డోలి రమేష్, కరంచంద్, ప్రభాకర్ గౌడ్, అమీనుద్దీన్, ఉస్మాన్, లక్ష్మణ్ యాదవ్, శోభన్ బాబు, శ్రీధర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, హేమంత్ పటేల్, మహేష్ , శరణ గిరి, మారుతి ప్రసాద్, సురేష్ , జె.కే.సాయి గౌడ్, శివ సాయి యాదవ్, కేబుల్ రమేష్ , శోభా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News