Wednesday, April 22, 2026
Homeకరీంనగర్JEE Mains | జేఈఈ మెయిన్స్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల సత్తా

JEE Mains | జేఈఈ మెయిన్స్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల సత్తా

సోమవారం రోజు వెలువడిన జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో జాతీయస్థాయిలో కరీంనగర్ నగరంలోని శ్రీ చైతన్య కళాశాలల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపి అద్భుత ర్యాంకులు సాధించినట్లు శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలిపారు ఎం. సిరి చందన 143 సాయి సిరి 164 ఎం .శ్రీ సంజన 1008 అభినవ్ 1141 కే. నిఖిల్ 2010 వి కీర్తన 5699 సిహెచ్. కీర్తన 7074 ఎం శ్రీరామ్ రెడ్డి 14515 భూక్య శ్రీవిద్య15870 యోగేశ్వర్ 17557 గుగులావత్ పల్లవి 19745 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించినందుకు తమకు ఎంతో గర్వకారణమని జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరైన వారిలో 50% మంది విద్యార్థినీ విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు తెలిపారు.

అనునిత్యం పర్యవేక్షణ ,ఆత్మస్థైర్యం పెంపొందించే శిక్షణతో అద్భుత ఫలితాలు సాధించినట్లు అన్నారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలో కూడా తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి లలో సీట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయ సాధనకు ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడిన అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి డిం జగన్మోహన్ రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఏజీఎం శ్రీనివాస్ అధ్యాపక, అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News