- రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిస్తున్నాం..
- సిరిసిల్ల నుంచి పాదయాత్రగా పార్టీ ఆవిర్భవ కార్యక్రమనికి వస్తున్నారు..
- అధికార కాంగ్రెస్, విపక్షమైన బీ.ఆర్.ఎస్. పార్టీలపై విమర్శలు..
- జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత..
జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
కొత్త రాజకీయ పరిణామం జరుగబోతోంది కాబట్టి.. పబ్లిసిటి మెటీరియల్ డిస్ట్రబ్ చేయొద్దని జిహెచ్ఎంసిని కోరారు.. ఆర్టీసీ సమ్మెకు ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు.. ఆర్టీసీని ప్రవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు.. రాష్ట్రంలో మక్కలు కొనే దిక్కు లేదు.. నిన్న బిఆర్ఎస్ సభలో ప్రజల సమస్యలపై ప్రస్తావించకుండా ఉత్త కథలు చెప్పారు.. బిఆర్ఎస్ సభలో కేంద్ర ప్రభుత్వన్ని పల్లెత్తి మాట కూడా అనలేదు.. ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఎలాగూ లేదు.. ఓటమి కారణం ప్రజలు అని వారిని తప్పు పడుతున్నారు..
రాజశేఖర్ రెడ్డి ఉంటే నాకు తెలంగాణ గూర్చి ఎందుకు అని జీవన్ రెడ్డి అన్నారు.. తెలంగాణ ఉద్యమ కారుల గూర్చి బిఆర్ఎస్ ఎక్కడ మాట్లాడటం లేదు. 75 సంవత్సరాల కురవృద్ధుడు బిఆర్ఎస్ లో ఏమి చేస్తారు.. గుంట నక్క డిల్లీ వెళ్తే ముఖ్యమంత్రి డీల్ కుదుర్చేలా చెబుతున్నారు.. ఎవరు ప్రతి పక్షంలో ఎవరు అధికారం లో ఉండాలనేది చెప్పడానికి సీఎం ఎవరు.. వచ్చే పదేళ్లలో ఎక్కడ అధికారంలో ఉంటారూ..? మీరు ఎలా చెబుతారు ప్రజలు చెప్పాలి.. నిన్న జరిగిన రెండు సభల్లో బిఆర్ఎస్ ఉత్త కథలు చెబితే కాంగ్రెస్ రెడ్డి పిట్ట కథలు చెప్పింది..
ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర రాజకీయాల్లో నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాము.. తెలంగాణ ప్రజలకు నూతన పార్టీ ఆవిర్భావానికి ఆహ్వానం
సిరిసిల్ల నుంచి కార్యకర్తలు పాదయాత్రగా స్టార్ట్ అయ్యారు.. ఈ నెల 25 న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని డీజీపీని కోరుతున్నా.. కొత్త పార్టీ ప్రచార హోర్డింగ్స్ కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేస్తున్న.. ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా..
ఆర్టిజన్లను బెదిరించి వారితో సమ్మె విరమించారు.. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, నీటి ఎద్దడి, కరెంటు కోతలు లాంటి సమస్యలు ఉన్నాయి.. ప్రభుత్వం ఒక సభ, ప్రధాన ప్రతిపక్షం ఇంకో సభ పెట్టింది.. బీఆర్ఎస్ ఉట్టి కథలు, కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది.. ప్రజల వెతలు ఎవరూ చెప్పలేదు.. జగిత్యాలలో 75 ఏళ్ల కురువృద్ధుడిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.. ఆ నాయకిడికి మీకు 25 ఏళ్ళు తగ్గాయి అని అంటున్నారు..
తెలంగాణలో యూత్ లేరా…? కొత్త పార్టీలో యువతకు అవకాశాలు ఉంటాయి.. మా పార్టీ రాజకీయాల్లో చేంజ్ తీసుకువస్తుంది..
బిఆర్ఎస్ పార్టీ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు.. మహిళా బిల్లు, డీలిమిటేషన్ పై ఒక్క మాట మాట్లాడలేదు..
బిఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదు.. మా ఓటమికి కారణం మీరే అంటూ ప్రజలను బీఆర్ఎస్ బ్లేమ్ చేస్తోంది.. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. తెలంగాణ ఉద్యమంపై జీవన్ రెడ్డి పోటీ చేశారు..
వెయ్యి ఏండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు.. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక్క మాట లేదు.. తెలంగాణ ఉద్యమ కారులు భిక్షాటన చేస్తారు అంట.. గుంట నక్క ఢిల్లీలో ఆర్.ఎస్.ఎస్ పెద్దలను కలవడానికి వెళ్లారని రేవంత్ రెడ్డి అంటున్నారు.. కాలేశ్వరంలో కేసులో ఏదో జరుగుతుందని సీఎం అంటున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి గుంట నక్కతో డీల్ మాట్లాడుతున్నారు.. కోర్టు తీర్పులను ప్రభావితం చేసే విధంగా సీఎం మాట్లాడుతున్నారు..
తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు…? వచ్చే పదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఎలా ఉంటారు.. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి డిసైడ్ చేయాలి కదా…? బీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు.. రెండు పార్టీలు బల ప్రదర్శన చేస్తున్నాయి.. ప్రజల సెంట్రిక్ గా రాజకీయాలు రావాలి.. ఆడబిడ్డగా కొత్త తరహా రాజకీయాలతో మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి.. ప్రభుత్వానికి కార్మికులు అంటే లెక్క లేదు.. ఆర్టీసిని ప్రయివేటు పరం చేసే కుట్ర చేస్తున్నారు.. ఆర్టీసిని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు..
