Tuesday, April 21, 2026
Homeఆదిలాబాద్Prajavani | ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Prajavani | ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు తో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఆర్జీదారుల నుండి సమస్యలను అడిగి తెలుసుకునీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News