Thursday, April 16, 2026
Homeఆదిలాబాద్Reservation | బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి..

Reservation | బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి..

  • కేంద్ర ప్రభుత్వానీకి పద్మశాలి సంఘం డిమాండ్..
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంఘం సమావేశం..

మంచిర్యాల జిల్లా కేంద్రం లో జిల్లా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ సమావేశమై పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు లో దేశం లోని మెజారిటీ బీసీ మహిళలకు సబ్ కోటా 16.5% కల్పించాలని ఈరోజు జరిగిన సంఘం సమావేశంలో కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు పార్లమెంట్ లో మహిళా బిల్లు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏం ఉందని 2026 జనాభా లెక్కల ప్రకారం జనగణన, కులగణన పూర్తి కాకముందే డి లి లిమిటేషన్ పేరుతో, మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరుతో బీసీ లను దేశ వ్యాప్తంగా రాజకీయంగా అణిచివేయాలని ఎన్డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, మహిళా బిల్లు పేరుతో అగ్ర కులాలకు రాజ్యాధికారం కట్టబెట్టాలనే కుట్ర లో భాగమే ఈ మహిళా బిల్లు అని పేర్కొన్నారు.

- Advertisement -

స్థానిక సంస్థలల్లో మహిళా రిజర్వేషన్లకు ఏ విధంగా నైతే ఉప కోట అమలు జరుగుతుందో అదే విధంగా చట్ట సభల్లో కూడా బీసీ ఊపకోట అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. దేశంలోని అన్ని ప్రతిపక్ష జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకుండా పార్లమెంట్ లో ప్రవేశ పెడుతున్న అగ్ర వర్ణ మహిళలకు రాజ్యాధికారం కట్టబెట్టే ఈ మహిళా బిల్లును వ్యతిరేకించాలని పద్మశాలి సంఘం, బీసీ ల ఐక్య వేదిక ప్రధాన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.

దేశ జనాభా లో 60% ఉన్న బీసీ కులాల జనాభా ను, మహిళలను రాజకీయంగా అణగదొక్కి అడగకముందే అగ్ర వర్ణ మహిళలకు చట్ట సభల్లో 33% శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెడుతున్నారంటే నేను బీసీ ప్రధాన మంత్రినే అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ పూర్తిగా అగ్ర వర్ణ ఆధిపత్య కులాల వారికి అంకిత భావంతో సేవ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారని, గతం లో దేశంలోని అతి తక్కువ శాతం గా ఉన్న అగ్ర వర్ణల పేదలకు EWS పేరుతో ఎవరు అడగకముందే కనీసం వినతి పత్రం కూడా ఇవ్వకుండానే 10% రిజర్వేషన్ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల బీసీ లకు ఏ విధంగా నైనా రాజకీయంగా ఎదగకుండా బీసీ లను అణిచివేయడం కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలకే సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేసారు.

రేపు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని లేని యెడల రాబోయే రోజులలో బీసీ వ్యతిరేక పార్టీలకు మా ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. అదే విధంగా దేశంలోని , రాష్ట్రంలోని మెజారిటీ బీసీ ప్రజలు మేలుకొని ఈ మహిళా బిల్లు లో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని ఉద్యమాలు చేయాల్సిందిగా ఈ సమావేశంలో తీర్మానం చేసారు.

ఈ యొక్క సమావేశంలో తెలంగాణా ఉద్యమ కారుల ఐక్య వేదిక, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు , రాష్ట్ర బీసీ సంఘాల నాయకుడు గజేలి వెంకటయ్య , ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని , కార్యదర్శి అడిచర్ల రాజేశం, నాయకులు గోపతి లక్ష్మణ్ , అంకం చంద్రయ్య , బి దామోదర్ , ఎం సత్యనారాయణ , నారాయణ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News