- అష్టదిగ్బంధనంగా తనిఖీలు
- పత్రాలు, ఫీజుల లావాదేవీలపై దృష్టి
- అక్రమాల అనుమానాలపై లోతైన విచారణ
కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జిల్లాలో కలకలం రేపింది.గురువారం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చేరుకున్న అధికారులు కార్యాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు ప్రారంభించారు.
తనిఖీలలో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న రికార్డులు, పాత, తాజా నమోదు పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉందా లేదా, ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
ఇక ఫీజుల వసూళ్లు, లావాదేవీల నిర్వహణలో ఏవైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా అనే కోణంలో కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తూ అవసరమైన సమాచారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్రమాలపై స్పష్టత రావాల్సి ఉంది.సోదాలు ఇంకా కొనసాగుతున్నా క్రమంలో.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
