Thursday, April 16, 2026
Homeఆదిలాబాద్Protest | ఎయిర్ టెల్ టవర్ పనులను నిలిపేయాలి..

Protest | ఎయిర్ టెల్ టవర్ పనులను నిలిపేయాలి..

  • డిమాండ్ చేసిన వాకర్స్ అసోసియేషన్..
  • రేడియేషన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి..
  • మంచిర్యాల కలెక్టర్ కు వినితి పత్రం అందజేత..

మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో నిర్మిస్తున్న ఎయిర్ టెల్ టవర్ పనులను నిలుపుదల చేయాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సంఘటన స్థలంలో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రేడియేషన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గత సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ యధావిధిగా ఎయిర్ టెల్ పనులు కొనసాగుతుండడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి సింగరేణి కాలరీస్ కంపెనీ జిఎం రాధాకృష్ణ తక్షణమే చర్యలు చేపట్టి నిర్మాణ పనులను మరో స్థలానికి తరలించారని సభ్యులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News