Saturday, April 11, 2026
Homeఆదిలాబాద్Phule Jayanti | ఘనంగా మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

Phule Jayanti | ఘనంగా మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో మహాత్మ జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో రత్న కళ్యాణి మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. ఆయన చూపిన మార్గాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, డీఈవో భోజన్న, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News