Thursday, April 9, 2026
Homeఆంధ్రప్రదేశ్Buddha Venkanna | ప్రజల దృష్టిని మళ్లించడానికే ఉన్నాడు జగన్..

Buddha Venkanna | ప్రజల దృష్టిని మళ్లించడానికే ఉన్నాడు జగన్..

  • అందుకే ఏబీఎన్ రాధాకృష్ణను టార్గెట్ చేస్తున్నారు..
  • విమర్శలు కురిపించిన బుద్దా వెంకన్న..

‘మావిగన్’ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన ట్రోల్స్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణను టార్గెట్ చేశారని బుద్దా వెంకన్న ఆరోపించారు. “మావిగన్ ట్రోల్స్ తప్పించుకోవడానికే రాధాకృష్ణపై బురద జల్లుతున్నావా?” అని ఆయన ప్రశ్నించారు.

గతంలో సాక్షి మీడియాలో అమరావతి మహిళలను, చంద్రబాబు భార్యను కించపరిచేలా రాసినప్పుడు భారతీ రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పలేదని నిలదీశారు. తన తల్లి విజయమ్మ లేఖ గురించి, చెల్లి ఆవేదన గురించి సాక్షిలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. “నీ పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తావా? లోకేశ్ తన పాదయాత్రతో నీకు ఇప్పటికే సినిమా చూపించారు. చంద్రబాబు వరకు అక్కర్లేదు, లోకేశ్‌కు ట్రైలర్ కూడా చూపించలేవు” అని ఎద్దేవా చేశారు.

- Advertisement -

పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం అమానుషమని, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వెళ్లిన వైసీపీ నేతలెవరైనా సరే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సొంత చెల్లినే తిట్టించిన జగన్‌కు మహిళల హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీయించినప్పుడే ప్రజలు జగన్‌ను ఛీ కొట్టారని, ఇప్పుడు ‘మోకాళ్ల యాత్ర’ చేసినా ప్రజలు నమ్మరని బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను తరిమికొట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News