- మేడ్చల్ డిఐ కిరణ్
డిజిటల్ అరెస్టు, సైబర్ మోసాలపై మేడ్చల్ నేర విభాగం పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. మేడ్చల్ డి ఐ కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్టు అనే పదం చట్ట పరిధిలో ఎక్కడ రాసిలేదని, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసగాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తే భయాందోళన చెందకుండా ఉండాలని సూచించారు. పోలీసు అధికారులు యూనిఫామ్ ధరించి డిజిటల్ అరెస్టులు చేయరని అలా చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు.
తక్కువ ధర ఆశ చూపి వాహనాలు, మొబైల్ ఫోన్స్ అమ్ముతామని ముందే డబ్బులు అడిగితే డబ్బులు చెల్లించకూడదని, నేరుగా కొనుగోలు చేస్తేనే సైబర్ మోసం బారిన పడకుండా ఉంటారని చెప్పారు. పొరపాటున సైబర్ మోసానికి గురైతే 1930 నెంబర్కు కాల్ చేసే బాధితులు ఫిర్యాదు చేసుకోవాలని అన్నారు. సంబంధం లేని అవసరంలేని అప్లికేషన్లు మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేయకుండా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శక్రులాల్, కానిస్టేబుళ్లు శ్యామ్ చౌహన్, పూజిత, అక్షర, రాజు పాల్గొన్నారు.
