Wednesday, April 1, 2026
Homeహైదరాబాద్‌Award | ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారానికి ఐసీఏఆర్

Award | ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారానికి ఐసీఏఆర్

  • ఐఏఆర్‌ఐ డైరెక్టర్ డా. సి.హెచ్. శ్రీనివాసరావు ఎంపిక.

ఐసీఏఆర్ – భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ –ఐ ఎఆర్ఐ) డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావును ప్రతిష్టాత్మక ‘ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్’ జాతీయ అవార్డు (2024–25)కు ఎంపిక చేసినట్లు రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఆర్ఐసిఎఆర్ఇఎ) ప్రకటించింది. భారత ఆహార భద్రత కోసం విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు గుర్తింపుగా నుజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) సహకారంతో 2004-05లో ఈ అవార్డును నెలకొల్పారు.

డా. ఎం.ఎస్. స్వామినాథన్ జన్మ శతాబ్ది సంవత్సరంలో ఈ అవార్డును ప్రకటించడం విశేషం. ప్రముఖుల వరుసలో డా. రావు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎనిమిది మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ గౌరవాన్ని పొందారు. ఆ జాబితాలో ఇప్పుడు డా. శ్రీనివాసరావు చేరారు. గతంలో ఈ అవార్డు పొందిన వారిలో డా. గెండా లాల్ జైన్ (పౌల్ట్రీ), డా. ఎస్. నాగరాజన్ (ప్లాంట్ పాథాలజీ), డా. వి. ప్రవీణ్ రావు (మైక్రో ఇరిగేషన్), డా. పి.వి. సత్యనారాయణ (వరి వంగడాలు) వంటి ప్రముఖులు ఉన్నారు.

- Advertisement -

ఎంపిక కమిటీ: మాజీ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ అత్యంత పారదర్శకంగా ఈ ఎంపికను చేపట్టింది. ఈ కమిటీలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత డా. విజయ్ గుప్తా, డా. బాల రవి, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ డా. సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా వ్యవహరించారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సహజ వనరుల యాజమాన్యంలో డా. రావు చేసిన పరిశోధనలు అమోఘం.

పర్యావరణ ప్రభావం: 40 లక్షల హెక్టార్లలో వనరుల పరిరక్షణ సాంకేతికతను అమలు చేయడం ద్వారా ఏటా రూ. 380 కోట్ల డీజిల్ ఖర్చును ఆదా చేయడంలో కీలక పాత్ర పోషించారు. వాతావరణ అనుకూలత: 637 జిల్లాలకు వ్యవసాయ ఆకస్మిక ప్రణాళికలు, 151 వాతావరణ తట్టుకునే గ్రామాలను రూపొందించారు. విద్యా రంగం: ఇప్పటివరకు 363 పరిశోధనా పత్రాలను, 57 పుస్తకాలను ప్రచురించారు. బంగారు పతకం, ప్రశంసా పత్రం మరియు రూ. 2,00,000 నగదుతో కూడిన ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 18న అందజేయనున్నారు.

సాయంత్రం 5:00 గంటలకు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ నందు జరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గౌరవ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఆర్ఐసిఎఆర్ఇఎ 1997లో స్థాపించబడిన ఈ స్వచ్ఛంద సంస్థ, శాస్త్రీయ విజ్ఞానాన్ని రైతులకు మరియు సామాన్య ప్రజలకు చేరవేయడంలో కృషి చేస్తోంది.

నుజివీడు సీడ్స్ 1973లో ప్రారంభమైన ఈ సంస్థ భారత విత్తన రంగంలో అగ్రగామి. ముఖ్యంగా బీటీ కాటన్ విత్తనాలతో దేశ వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించింది. 50 లక్షల మందికి పైగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తూ దేశ ఆహార భద్రతలో కీలక భాగస్వామిగా కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్పివి విద్యాసాగర్ రావు ప్రెసిడెంట్, వై. మురళీధరుడు వైస్ ప్రెసిడెంట్, సతీష్ కుమార్ న్యూజివీడు సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సి. బాగయ్య టెస్లర్, పి. చక్రపాణి సెక్రటరీ, ఆశిష్ రాయ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News