Tuesday, March 31, 2026
Homeక్రైమ్ వార్తలుUttar Pradesh | లిఫ్ట్ ఇచ్చి బాలికపై అత్యాచారం..

Uttar Pradesh | లిఫ్ట్ ఇచ్చి బాలికపై అత్యాచారం..

  • ఉత్తరప్రదేశ్, బాఘ్ పాత్ లో సంఘటన..

ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒక వ్యక్తి లిఫ్ట్‌ ఇచ్చాడు. ఇద్దరిని కారులో బంధించాడు. ఒక యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి చెల్లెళ్లు ఈ విషయాన్ని తమ తల్లికి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈద్‌ సంత నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తెలిసిన వ్యక్తి ఇంటి వద్ద దింపుతానని నమ్మించి వారిని కారులో ఎక్కించుకున్నాడు.

కాగా, కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ వ్యక్తి కారు ఆపాడు. డోర్‌ లాక్‌ చేసి 12, 6 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలను కారులో బంధించాడు. వారి అక్క అయిన 19 ఏళ్ల యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని ఆమెను బెదిరించాడు. మరోవైపు రెండు రోజుల తర్వాత ఆ యువతి చెల్లెళ్లు జరిగిన విషయాన్ని తమ తల్లికి చెప్పారు. దీంతో వారి తల్లి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడ్ని దీపక్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News