ధరల పెరుగుదలపై ప్రశ్నిస్తే అంకెల గారడీ సమాధానం.. బ్రతుకు మాత్రం భారమైంది… ప్రజాస్వామ్య బలంతో సభలు గర్జిస్తే.. ప్రజల గొంతు మాత్రం మ్యూట్లోనే ఉంది.. అవినీతి వార్తలు రోజూ వినిపిస్తున్నాయి.. ఆశ్చర్యం మాత్రం ఎప్పుడో చనిపోయింది.. యువత చేతిలో ఉద్యోగాలు లేవు.. నినాదాలు మాత్రం మార్మోగుతున్నాయి.. మతం పేరుతో రాజకీయాలు నడుస్తుంటే మనిషితనం సైడ్ బెంచ్లో కూర్చుంది. ప్రశ్నలు అడిగేవాడు దేశద్రోహి.. మౌనం పాటించేవాడు మంచి పౌరుడు.. సత్యం నత్తనడకన సాగుతుంటే, అబద్ధం హెలికాప్టర్లో విహరిస్తోంది. ఇదే మన కాలపు అభివృద్ధి.. చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ
- ఖాన్ సాబ్
- Advertisement -
