Homeఆదిలాబాద్Nirmal | నిర్మల్ లో నో స్టాక్ బోర్డులు..

Nirmal | నిర్మల్ లో నో స్టాక్ బోర్డులు..

  • నిర్మల్ జిల్లా కేంద్రంలో అవస్థలు పడుతున్న వాహనదారులు..
  • పెట్రోల్ కోసం బారులు తీరుతున్న ప్రజలు..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న సందేహంతో అర కిలోమీటర్ పొడువునా క్యూ లైన్ కట్టి మరి తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకుంటున్నారు. పెట్రోల్ బంకులలో సరిపడా ఇంధనం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల వల్ల వాహనదారులు పెట్రోల్ బంకులకు బారులు తీరుతూ తమ వాహన ట్యాంకులను పూర్తిగా నింపుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందని బంకు యజమానులు పేర్కొంటున్నారు.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపు చేసినప్పటికీ 48గంటల పాటు ఇంధనం రావడం లేదంటేన్నారే తప్ప, సరఫరాలో ఎలాంటి లోపం లేదన్నారు.

No Stock Boards in Nirmal Petrol Bunks

- Advertisement -
RELATED ARTICLES

Latest News