Tuesday, March 24, 2026
Homeహైదరాబాద్‌Indiranagar | మూడు నెలలుగా నిలిచిపోయిన ఇందిరానగర్ రోడ్డు పనులు

Indiranagar | మూడు నెలలుగా నిలిచిపోయిన ఇందిరానగర్ రోడ్డు పనులు

  • ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సుమారు రూ.16 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి బడ్జెట్ కేటాయించినప్పటికీ,మూడు నెలల క్రితం రోడ్డు తవ్వి ఒక లేయర్ కంకర వేసి పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారిని రోజూ వృద్ధులు,మహిళలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వినియోగిస్తున్న నేపథ్యంలో, అర్థాంతరంగా వదిలేసిన పనుల కారణంగా ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నటువంటి వాహనదారులు వృద్ధులు అదుపుతప్పి కింద పడ్డ సందర్భాలు అనేకం కాగా ప్రమాదకరంగా మారాయి.

- Advertisement -

కంకర రోడ్డు పై వాహనదారులు తరచుగా స్కిడ్ అవుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.ఇప్పటికే పలువురు గాయపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.అదేవిధంగా,రోడ్డు పనుల వల్ల భారీగా లేచే దుమ్ము ధూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు,ఇతర అనారోగ్యాలు పెరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

డ్రైనేజీ ఓపెన్ నాలా నుండి తీసిన మట్టి కుప్పలను కూడా తరలించకపోవడంతో దుర్వాసన వ్యాపించి మరింత అసౌకర్యం కలిగిస్తోంది.ఈ సమస్యలపై హైదరాబాద్ నగర మహంకాళి జిల్లా బీజేపీ కన్వీనర్ నగరపు శ్యామ్ తో కలిసి కాలనీ ప్రెసిడెంట్ మాధవ్ జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులను పలుమార్లు కలిసినా స్పందన లేకపోవడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాలనీ వాసులు, అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News