- ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్
- వార్డు కౌన్సిలర్ నర్సంపల్లి రాజిరెడ్డి
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు 18వ వార్డులో కౌన్సిలర్ నర్సంపల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో నాయకులు హుస్సేన్, మద్ది శేఖర్ రెడ్డి, యువకులు, పార్టీ నాయకులు, సీకేజీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
