Saturday, March 21, 2026
Homeమెదక్‌Inauguration | నర్మెట్ట గ్రామంలో రైతు ఉత్సవాలు..

Inauguration | నర్మెట్ట గ్రామంలో రైతు ఉత్సవాలు..

  • రేపు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం..
  • ముఖ్యమంత్రి చేతులమీదుగా కార్యక్రమం..

ప్రజాపాలనలో భాగంగా 20, 21, 22 తేదీలలో సిద్ధిపేట జిల్లాలోని నగునూరు మండలం నరమెట్ట గ్రామములో రైతు ఉత్సవాలను నిర్వహిస్తున్నారని.. ముఖ్యముగా రేపు అనగా 22 ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభొత్సవం చేయనున్నారని జిల్లా వ్యవసాయ అధికారి ఉష తెలియచేసారు..

ఇందుకు గాను రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి , మాడుగుల, అమంగల్, కేశంపేట, షాబాద్, షాదునగరర్ మండలాల నుంచి రెండు వందల మంది రైతులను నాలుగు బస్సులలో నరమెట్ట గ్రామానికి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని.. ఆదివారం ఉదయం ఏడు గంటలకు మండలంలోని నిర్దేశిత ప్రదేశాలనుంచి రైతులను ఎక్కించుకుని బస్సులు బయదేరుతాయని, వీరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు..

- Advertisement -

రైతులందరూ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.. అంతే కాకుండా అక్కడ దాదాపుగా నూటయాభయి స్టాళ్లను ఏర్పాటు చేయటం జరిగిందని, ఇట్టి స్టాళ్లలో ఆధునిక వ్యవసాయములో ఉపయోగపడే యంత్ర పరికరాలు, సామాగ్రి, సాగు విధానాలు ప్రదర్శించబడుతున్నాయని, వీటిని సందర్శించి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాల్సినదిగా ఆమె తెలియచేసారు.

అంతే కాకుండా ముఖ్యమంత్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమము ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్రములోని అన్ని రైతు వేదికలలో లైవ్ టెలికాస్ట్ చేస్తారని, సిద్ధిపేట రాలేని రైతులు, ప్రజా ప్రతినిధులు దగ్గరలోని రైతు వేదికలో హాజరు అయ్యి ప్రారంభోత్సవ కార్యక్రమమును తిలకించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినవలసినదిగా తెలియ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News