Saturday, March 21, 2026
Homeకెరీర్ న్యూస్Jobs | స్టడీస్ అండ్ డెలివరీ పోస్టులు..

Jobs | స్టడీస్ అండ్ డెలివరీ పోస్టులు..

  • సువర్ణావకాశాన్ని ఇచ్చిన టామ్ కామ్..

చదువుకున్న చదువుకు తగ్గట్టుగా, భారీ జీతంతో విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఎంతోమంది కలలు కంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన టామ్‌కామ్ ఒక గొప్ప సువర్ణావకాశాన్ని తెచ్చింది. ఈ సంస్థ ఒమన్‌ కేంద్రంగా డైరెక్టర్ (స్టడీస్ అండ్ డెలివరీ) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి నెలకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ జీతం వస్తుంది. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ కెరీర్‌ను మార్చుకునే ఒక గొప్ప వేదిక.

టామ్‌కామ్ స్టడీస్ అండ్ డెలివరీ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఇంజనీరింగ్‌ (మైనింగ్, మెకానికల్, సివిల్ లేదా ప్రాసెస్) పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏ (MBA) లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఉద్యోగానికి కనీసం 15 ఏళ్ల అనుభవం తప్పనిసరి. అలాగే వయసు 30 నుంచి 58 ఏళ్ల లోపు ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News