Tuesday, March 17, 2026
Homeఅంతర్జాతీయంKabul | కాబూల్ ఆస్పత్రిపై దాడి..

Kabul | కాబూల్ ఆస్పత్రిపై దాడి..

  • ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిన సంఘటన..
  • తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం..

ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఆస్పత్రిపై పాక్ జరిపిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. యుద్ధ రీతిని పక్కనబెట్టి ఒక ఆస్పత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆఫ్ఘన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇండియా కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పాక్ చేసిన క్రూరమైన మారణహోమంగా అభివర్ణించింది.

ఆఫ్ఘన్‌పై దాడిపై భారత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ దాడి ఎంతమాత్రం యుద్ధ చర్య అనిపించుకోదని, ఈ మారణహోమాన్ని పాక్ ఒక ఆర్మీ ఆపరేషన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లోని ఒక డ్రగ్స్ చికిత్స కేంద్రంపై పాక్ సోమవారం రాత్రి దాడి చేసింది. ఈ దాడిలో 400 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు.

- Advertisement -

ఇలా ఆస్పత్రిపై దాడి చేయడం అంతర్జాతీయ యుద్ధ చట్టాలకు వ్యతిరేకం. దీనిపై ఆఫ్ఘన్ సహా అనేక దేశాల పాకిస్తాన్‌ను విమర్శిస్తున్నాయి. ఇండియా కూడా ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఇది కావాలని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా వర్ణించింది. తాము ఆయుధ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలిపింది.

తమ దేశంలో దాడులు చేస్తున్న తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) అనే తీవ్రవాద సంస్థకు ఆఫ్ఘన్ స్వర్గధామంగా మారిందని, అందువల్లే ఆ సంస్థపై దాడులు చేస్తున్నామని పాక్ చెబుతోంది. అయితే, దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఇండియా ఈ దాడిని క్రూరమైన, దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. ఇది ఆఫ్ఘన్ సార్వభౌమధికారంపై జరిగిన దాడి అని, ఇలాంటి దాడుల వల్ల ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం దెబ్బతింటాయని భారత్ వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News