Monday, March 16, 2026
HomeజాతీయంMP | దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

MP | దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

మొయినాబాద్‌ ఘటనపై తనపై వస్తున్న కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం స్నేహితుడి ఆహ్వానం మేరకు మాత్రమే అక్కడికి వెళ్లానని నిజం గెలుస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

తన వ్యక్తిత్వం గురించి ఏలూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తెలుసని.. కొన్ని మీడియా సంస్థలలో వస్తున్న తప్పుడు కథనాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, త్వరలోనే అన్ని వివరాలతో ప్రజల ముందుకు వస్తానని ఎంపీ పేర్కొన్నారు. అభిమానులు, ప్రజలు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News