Monday, March 16, 2026
Homeవరంగల్‌Tribute | మాన్యశ్రీ కాన్సిరాం ఆశయాలను కొనసాగించాలి.

Tribute | మాన్యశ్రీ కాన్సిరాం ఆశయాలను కొనసాగించాలి.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మాన్యశ్రీ కాన్షిరాం జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాన్షిరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ జంగిలి భాస్కర్ మాట్లాడుతూ…

మాన్యశ్రీ కాన్షిరాం బహుజన రాజ్యాధికారం సాధించడంలో దేశంలోనే ఒక గొప్ప సామాజిక న్యాయాన్ని పాటిస్తూ రాజ్యాధికార దిశగా రాజ్యాధికారాన్ని అందించిన బహుజన రాజ్యాధికార పితామహుడు అని అన్నారు.

- Advertisement -

ఈ దేశంలో అణగారిన వర్గాలకు దిక్సూచిగా నిలిచి ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారమే ఏకైక లక్ష్యంగా పోరాడిన గొప్ప బహుజన యోధుడు మాన్యశ్రీ కాన్షిరామని ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజా సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఏకం కావాలని అన్నారు.

ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక దళిత మహిళ బెహన్ జీ మాయావతి ని నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేసి బహుజన రాజ్యాధికార ఫలాలను దళితులకు అందించిన గొప్ప మేధావి కాన్షిరామని కొనియాడారు. బహుజనులకు పార్టీ కావాలని బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి” ఓట్ అమరా రాజ్ తుమారా నహి చలేగా నహి చేయగా” అనే నిదానదంతో రాజ్యాధికారానికి పీఠలు వేసిన గొప్ప సంఘసంస్కర్త మాన్య శ్రీ కాన్షిరాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాజు, శ్రీనివాస్, సురేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News