Tuesday, March 10, 2026
Homeకరీంనగర్Celebrations | 15వ డివిజన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Celebrations | 15వ డివిజన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

మహిళా దినోత్సవం సందర్భంగా నగరం లోని 15వ డివిజన్ లో కార్పొరేటర్ విప్పల సాయి జ్యోతి విష్ణు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు
ఈ సందర్భంగా డివిజన్ కు సంబంధించిన మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ విప్పల సాయి జ్యోతి విష్ణు మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత కొరకు తోడ్పడాలని మహిళల అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తానని అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ నా, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News