Sunday, May 10, 2026
Homeరంగారెడ్డిTraffic | అపశ్రవ్య దిశ వాహన చోదకులపై దృష్టి పెట్టండి..

Traffic | అపశ్రవ్య దిశ వాహన చోదకులపై దృష్టి పెట్టండి..

  • LB నగర్ ట్రాఫిక్ DCP ని కోరిన సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్

సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ శుక్రవారం Lb నగర్ ట్రాఫిక్ DCP వరికుప్పల శ్రీనివాస్ ని కలసి పలు ట్రాఫిక్ భద్రతా అంశాలపై మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు లో ప్రధానంగా అపశ్రవ్య దిశలో వాహనాలు నడిపే వారితో నే ఎక్కువ ప్రమాదం జరుగుతాయని, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని, ఇలాంటి వారిపై ఎక్కువగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సమావేశం లో సురక్ష సేవా సంఘం క్రియాశీలక సభ్యులు పిల్లి. శ్రీనివాస్ యాదవ్, శ్రీపాద, నరసింహ చారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News