- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో మహిళా ఉద్యోగులందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో, కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన క్రీడ పోటీలను, శనివారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపడం ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, మహిళలందరూ ప్రతిరోజు క్రీడలను ఆడాలని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా ఉద్యోగులకు లెమన్ స్పూన్, క్యారం బోర్డ్, చెస్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
