అధికార దాహంతో అగ్రరాజ్యాలు వేసే ఎత్తుగడలు.. సరిహద్దుల్లో చిమ్మే రక్తపు ధారలు.. ఇరాన్ సెగలు, ఇజ్రాయెల్ దాడులు.. అమెరికా వ్యూహాల మధ్య.. నలిగిపోతున్నది మానవత్వం.. మిగులుతున్నది శ్మశాన నిశ్శబ్దం.. తుపాకీ గొట్టం ఇరాన్-ఇజ్రాయెల్ వైపు ఉండొచ్చు.. కానీ దాని గురి ప్రపంచ శాంతిపై ఉంది.. క్షేపణుల హోరులో ఇంధన ధరల మంటలు.. అగ్రరాజ్యాల అహంకారపు యుద్ధం.. సామాన్యుడి బతుకుపై కోలుకోలేని గాయం.. నిజానికి యుద్ధం ఎవరికీ విజయాన్ని ఇవ్వదు.. కేవలం శవాల కుప్పలను, కన్నీటి నదులను మాత్రమే బహుమతిగా ఇస్తుంది.
- బీవీఆర్ రావు..
- Advertisement -
