- అప్పు ఇస్తామని ప్రకటించిన యాక్సిస్ బ్యాంకు..
టెస్లా కార్లపై రుణాలు ఇస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టెస్లా కార్లపై యాక్సిస్ బ్యాంక్ రుణాలు మంజూరు చేయనున్నది. దేశవ్యాప్తంగా ఈవీ వాహనాల వినిమయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టెస్లాతో జట్టుకట్టినట్టు, తద్వారా కొనుగోలుదారులకు తక్కువ వడ్డీకే వాహన రుణాలను మంజూరు చేయనున్నట్టు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -
