Thursday, March 5, 2026
HomeజాతీయంDefection | అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి షాక్..

Defection | అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి షాక్..

అసెంబ్లీ ఎన్నికలముందు అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ సైకియా ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీని సమస్యల్లో పడేసింది.

కాంగ్రెస్‌ పార్టీకి గత నెలలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్‌ కుమార్‌ బోరా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా పార్టీ మారిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఇటీవల సస్పెండ్‌ చేసింది. దాంతో వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News