ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా సైనిక చర్యలతో అంతర్జాతీయ వాతావరణం ఉత్కంఠ భరితమైంది. ఈ ఘర్షణ ప్రాంతీయ అస్థిరత్వమే కాక, ప్రపంచ ఆర్థిక సమతౌల్యానికీ ముప్పు. మధ్యప్రాచ్యం ఇంధన సరఫరాలో కీలకం కావడంతో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు, రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువలు మార్పులకు లోనవుతాయి. చివరికి భారం సామాన్యులపైనే పడుతోంది. ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి క్రియాశీలకంగా వ్యవహరించి, వీటో రాజకీయాలకంటే మానవ ప్రాణాల రక్షణ ముఖ్యం. తక్షణ కాల్పుల విరమణ, దౌత్య చర్చలు, పరస్పర నమ్మకం పునరుద్ధరణే స్థిర పరిష్కారం. ఆధిపత్యం శాశ్వత భద్రతను ఇవ్వదు. భయానక వాతావరణం కాదు.. విశ్వాస వాతావరణమే అసలైన నాయకత్వం.. శవాలపై విజయాలు కాదు, శాంతి ఒప్పందాలే చరిత్రలో నిలుస్తాయి.
- మేదాజీ
- Advertisement -
